ద్రవ్యోల్భణం కొంత మేర పెరిగింది. అయిన కూడా ఇంకా మైనస్‌లోనే ఉంది. జూన్ 20తో ముగిసిన వారానికి -1.30గా నమోదైంది.
అయితే గత ఏడాది ఇదే సమయానికి ద్రవ్యోల్బణం 11.8గా నమోదైనట్లు ఆర్థిక నిపుణులు తెలిపారు.
ఇదిలావుండగా ద్రవ్యోల్బణం మైనస్‌లో ఉన్నాకూడా మార్కెట్‌లో మాత్రం నిత్యావసర సరుకుల ధరలు ఏమాత్రం తగ్గడం లేదని ఆర్థిక నిపుణులు, గృహిణులు వాపోతున్నారు. |