పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారంనుంచి ప్రారంభమయ్యాయి. నిరుడు ఆర్థిక సంవత్సరం(2008-09)కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ తొలిరోజున లోక్‌సభకు సమర్పించారు. ఇందులో భాగంగా నష్టాల్లో ఉన్న ప్రభుత్వం రంగ సంస్థలనుంచి పెట్టుబడులను ఉహసంహరించనున్నట్లు ఆర్థికమంత్రి లోక్‌సభలో తెలిపారు. గురువారం లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆయన నష్టాల్లో ఉన్న సంస్థలను ఇకపై ప్రభుత్వం భరించే స్థితిలో లేదనిఆయన అన్నారు. ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా రక్షణ, బీమా రంగాల్లో దాదాపు 49శాతం మేరకు విదేశీ, ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించనున్నట్లు ఆయన లోక్‌సభకు విన్నవించారు. |