ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > 3నెలల్లో 6 లక్షలమంది ఉద్యోగాలు ఫట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
3నెలల్లో 6 లక్షలమంది ఉద్యోగాలు ఫట్
FILE
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచంలోని చాలా సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి పంపింది. అదే తరహాలో భారతదేశంలోకూడా పలు కంపెనీలు దాదాపు ఆరు లక్షల మంది ఉద్యోగులను ఇండ్లకు పంపాయి.

ఇందులో భాగంగానే నిరుడు ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 6 లక్షలమంది ఉద్యోగులను పలు దేశీయ కంపెనీలు ఇండ్లకు పంపడం జరిగింది. కాని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిస్థితి కాస్త మెరుగు పడే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.

కార్మిక, ఉపాధికల్పన శాఖ పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం నిరుడు ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో దాదాపు దేశీయ కంపెనీలు ఐదు లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిందని ఓ సర్వేలో తేలినట్లు గురువారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో తెలిపింది.

ముఖ్యంగా ఈ తగ్గుదల రత్నాలు మరియు నగల పరిశ్రమ, ఆటోమొబైల్ రంగంలో తీవ్రంగా ఉన్నదని ఆ శాఖ పార్లమెంటుకు తెలిపింది.

ఇదిలావుండగా నిరుడు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోకూడా ఉద్యోగుల కోత అత్యధికంగా ఉన్నదని, అయితే ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని సర్వే తెలిపింది.

కాగా నిరుడు చివరి త్రైమాసికం అంటే జనవరి నుంచి మార్చి నెల వరకు ఈ రంగాలలోనే రెండున్నర లక్షల మందిని కొత్తగా నియమించుకున్నట్లు సర్వేలు తెలిపాయని ఆ శాఖ పార్లమెంటుకు విన్నవించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పెట్టుబడులను ఉపసంహరిస్తాం: ప్రణబ్
ద్రవ్యోల్బణం -1.3 శాతంగా నమోదైంది...!
ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన మంత్రి ప్రణబ్
అమ్మకాలు తగ్గాయి : టాటా మోటార్స్
ఎగుమతులను పెంచుకునేందుకు బడ్జెట్లో రాయితీలు !
షిప్పింగ్ ప్రాజెక్టులకు రూ.3300 కోట్ల నిధులు