ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > 29.2 శాతం తగ్గిన ఎగుమతులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
29.2 శాతం తగ్గిన ఎగుమతులు
మే నెలలో ఎగుమతులు 29.2 శాతం మేర తగ్గాయి. వరుసగా ఎనిమిది నెలల నుంచి ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయి. గత సంవత్సరం యూరప్‌, అమెరికా దేశాలకు ఎగుమతులు సుమారు 15.55 బిలియన్‌ డాలర్ల మేర క్షీణించాయి.

అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే నెలలో 11.01 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు తగ్గాయని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

అలాగే దిగుమతులు కూడా వరసుగా గత ఐదు నెలల నుంచి తగ్గుతూ వచ్చాయి. 39.2 శాతం మేర అంటే 16.21 బిలియన్‌ డాలర్ల మేర గతఏడాది మేలో తగ్గినట్లు సమాచారం.

అదే మే నెలలో వాణిజ్యలోటు 5.20 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. గత సంవత్సరం మే 2008లో 11.13 బిలియన్‌ డాలర్లు.

ఏప్రిల్‌లో ఎగుమతులు 33.2 శాతం 10.74 బిలయన్‌ డాలర్లకు తగ్గింది. ఇదే గత సంవత్సరం 16.08 బిలియన్‌ డాలర్లమేర తగ్గాయి.

ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-మే నెలల కాలానికి 31.2 శాతం మేర తగ్గి 21.75 బిలియన్‌లు కాగా, అదే కాలానికి గత సంవత్సరం 31.62 బిలియన్‌ డాలర్లుగా నమోదు చేసింది.

కాగా నిరుడు ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు స్వల్పంగా 3.4 శాతం మేర పెరిగి 168.7 బిలియన్లకు చేరాయి.

గతఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం ప్రభావం మన ఆర్ధిక వ్యవస్థపై కూడా తీవ్రంగా పడిందని ప్రభుత్వం ప్రకటించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
3నెలల్లో 6 లక్షలమంది ఉద్యోగాలు ఫట్
పెట్టుబడులను ఉపసంహరిస్తాం: ప్రణబ్
ద్రవ్యోల్బణం -1.3 శాతంగా నమోదైంది...!
ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన మంత్రి ప్రణబ్
అమ్మకాలు తగ్గాయి : టాటా మోటార్స్
ఎగుమతులను పెంచుకునేందుకు బడ్జెట్లో రాయితీలు !