భారతదేశంలో భారీ ఎత్తున పెట్టుబడులకు పెట్టేందుకు జపాన్‌కు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రత్యేకించి ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు అధిక అవకాశాలున్నాయని జపాన్ కాన్సులేట్ జనరల్ కాజు మినగావా వెల్లడించారు.
భారత్‌లో యువ ఇంజనీర్లు, నైపుణ్యంకలిగిన కార్మికులకు కొదవలేదని ఆయన పేర్కొన్నారు. మధురైలో ఏర్పాటు చేసిన సీఐఐ సదుస్సులో ఆయన ప్రసంగింస్తూ... మంచి ఉత్పత్తి ప్రమాణాలు, ప్రాథమిక సదుపాయాల పరంగా తమిళనాడు సురక్షితమైందిగా తాము భావిస్తున్నట్టు చెప్పారు. కోయంబత్తూరులోని పరిశ్రమలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలో 630 ఎకరాల్లో నిస్సాన్ కంపెనీ చేపడుతున్న ఉరగాడమ్ ప్రాజెక్టు రానున్న ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. |