ఎయిర్ ఇండియా ఉద్యోగులు రెండుగంటలపాటు పనిని నిలుపుదల చేయాలని కార్మిక సంఘాలు భావించాయి. వేతనాలు లభించడంలో ఆలస్యం మరియు జీతంలో కోత విధించడంపై ఎయిర్ ఇండియా కార్మికులు, ఉన్నతాధికారులు మధ్య కాస్త ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రెండు గంటలపాటు సమ్మె చేయాలని కార్మిక సంఘాలు తెలిపాయి. ఇది మధ్యాహ్నం ఒంటిగంటనుంచి మూడు గంటల మధ్య పనిని బహిష్కరించాలని వారు భావించారు. దీంతో విమానాల రాకపోకలలో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. దీనికి సంబంధించి ప్రయాణీకులుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని, దీనిని కార్మికులు అర్థం చేసుకోవాలని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఉద్యోగులకు విన్నవించారు. ఇదిలావుండగా సిబ్బంది సమ్మెకు దిగితే వారి జీతంలో కోత విధిస్తామని ఎయిర్ ఇండియా ఉద్యోగులకు హెచ్చరించింది. అంతేకాక సమ్మెలో పాల్గొంటే కఠినమైన చర్యలుకూడా తీసుకుంటామని సంస్థ ప్రతినిధి తెలిపారు.వేతనాల చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చిన ఎయిర్ ఇండియా సంస్థ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోనందుకు నిరసనగా ఉద్యోగులు శుక్రవారం రెండు గంటలపాటు విధులను బహిష్కరించాలని భావించినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. |