ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ప్రభుత్వానికి రిలయన్స్ రాయల్టీ చెల్లించాలి : జితిన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రభుత్వానికి రిలయన్స్ రాయల్టీ చెల్లించాలి : జితిన్
కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్‌లో ఉత్పత్తి చేసే సహజవాయువుకు సహజవాయువులిమిటెడ్(రిల్) కేంద్ర ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలని పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ స్పష్టం చేశారు.

ఉత్పత్తి భాగస్వామ్య ఒప్పందం(పిఎస్‌సి)లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీని చెల్లించవలసి ఉంటుందని ఆయన తెలిపారు. గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా జితిన్ లిఖితపూర్వకంగా వివరాలను అందజేశారు.

డి6 బ్లాక్ నుంచి ఉత్పత్తి అయ్యే ఆయిల్, గ్యాస్‌లలో ప్రభుత్వానికి రావల్సిన వాటా, రాయల్టీలను నిర్ణయించడానికి నిబంధనావళిగా పిఎస్‌సి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా ప్రభుత్వం నిర్ణయించిన అమ్మకపు ధర ప్రకారం రాయల్టీ, లాభాల వాటా చెల్లించడానికి పిఎస్‌సిలో అవకాశం ఉందో లేదో జితిన్ స్పష్టం చేయలేదు.

డి6 బ్లాకులో ఉత్పత్తి అయ్యే ఆయిల్, గ్యాస్ క్షేత్రాల్లోని వనరుల యాజమాన్యపు హక్కులతో ప్రభుత్వం లాభాల వాటాదారుగా ఉంది.

కాగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే సహజవాయువుకు ప్రభుత్వం ధరను నిర్ణయించింది. ఒక మిలియన్ బ్రిటీష్ థెర్మల్ యూనిట్ ధరను 4.20 డాలర్లుగా నిర్ణయించింది.

అయితే అనిల్ అంబానీ గ్రూపు సంస్థలకు యూనిట్ గ్యాస్‌ను 2.34 డాలర్లకే సరఫరా చేయాలని ముంబై హైకోర్టు గత నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా హైకోర్టు సూచించిన ధర 44 శాతం తక్కువని అధికారులు పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రెండుగంటల పాటు సమ్మె : ఏఐ ఉద్యోగులు
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు : జపాన్‌
మహీంద్రా సత్యంలో ఆరుగురు డైరెక్టర్ల రీకాల్
మార్కెట్లో కోడిగుడ్లు ధరలు
29.2 శాతం తగ్గిన ఎగుమతులు
3నెలల్లో 6 లక్షలమంది ఉద్యోగాలు ఫట్