శుక్రవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన రైల్వే బడ్జెట్ బాగుందని ప్రధాని కితాబిచ్చారు. రైల్వే మంత్రి మమత లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో తాము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. దీనికిగాను మమత చాలా చాకచక్యంగా బడ్జెట్‌ను రూపొందించారని, దీంతో ప్రయాణీకులపై ఎలాంటి భారం పడలేదని ఆయన హర్షం వ్యక్తం చేశారు.రైలులో ప్రయాణించే ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు, భద్రత, ఆధునికీకరణకు సంబంధించి ప్రణాళికలను రూపొందించారని, ఇందులో ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందని ఆయన తెలిపారు. రైల్వేమంత్రి ప్రవేశపెట్టిని రైల్వే బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ... గతంలో ఎన్నికలకుముందు ప్రకటించిన వాగ్దానాల ప్రకారం ఆమె తను రూపకల్పన చేసిన బడ్జెట్లో తగు జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. ప్రయాణీకులకు, ఉద్యోగులకు మధ్య అవగాహన ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. |