అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా వార్షిక వేతనం 4లక్షల అమెరికా డాలర్లు. ఇది భారత కరెన్సీలో రూ. 1.91 కోట్లుగా ఉంది. తమ అధ్యక్షుడు తన వార్షిక వేతనం నాలుగు లక్షల అమెరికా డాలర్లు తీసుకుంటున్నట్లు వైట్ హౌస్ అధికారులు తెలిపారు.అలాగే వైట్‌హౌస్‌లో పనిచేసే సిబ్బంది వేతనాలు కూడా ఇంచుమించు ఒబామా వేతనంలో సగానికిపైగానే ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ దేశాధ్యక్షుడి కార్యాలయంలో పని చేస్తున్న మొత్తం 487మంది సిబంబంది జీతభత్యాల వివరాలను కాంగ్రెస్‌కు సమర్పించినట్లు చికాగోకు చెందిన సన్‌టైమ్స్ పత్రిక వెల్లడించింది.అమెరికా ప్రభుత్వం ఈ మొత్తం సమాచారాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో జులై నెల ఒకటవ తేదీన ఉంచిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ వెబ్‌సైట్ వివరాలు...వైట్‌హౌస్ డాట్ కామ్. ఇదిలావుండగా ఇప్పటివరకు ఈ విషయాన్ని ప్రభుత్వం మీడియాకు సమాచారం ఏదీ ఇవ్వలేదని ఆ పత్రిక పేర్కొంది. కాగా దీనిపై స్పందించడానికి వైట్‌హౌస్ అధికార వర్గాలు సుముఖత వ్యక్తం చేయలేదు. |