ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > రైల్వే ప్రాజెక్ట్‌లపై మౌళిక రంగం కన్ను
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రైల్వే ప్రాజెక్ట్‌లపై మౌళిక రంగం కన్ను
FileFILE
సాధారణ బడ్జెట్ రాకముందే రైల్వే బడ్జెట్ ప్రకటనతో స్టాక్ మార్కెట్‌ పుంజుకంటే.. మరోవైపు మౌళికరంగ పరిశ్రమకూడా మరింత అభివృద్ధి బాటన నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంతో రైల్వే స్టేషన్‌ల వృద్ధిని చేపట్టాలన్న రైల్వే బడ్జెట్‌లోని ప్రతిపాదన మౌళికరంగ పరిశ్రమ గమ్యాన్ని మార్చే పరిస్థితులు రానున్నాయి.

ఇలాంటి ప్రతిపాదనలు మౌళికరంగ పరిశ్రమ.. ఎనలేని వృద్ధి సాధించడానికి దోహదపడతాయని ప్రముఖ నిర్మాణ సంస్థ హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ సీఎండీ అజిత్ గులాబ్‌చంద్ తెలిపారు. ఇలాంటి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అదలా ఉంచితే.. ఈ తరహా ప్రతిపాదనతో త్వరలోనే రైల్వే శాఖలో భారీ స్థాయి ప్రాజెక్టులు రానున్నాయి.

ఈ ప్రాజెక్టులు తప్పనిసరిగా మౌలికరంగానికి ఎంతగానో ఉపకరించనున్నాయని సింప్లెక్స్ ప్రాజెక్ట్ సీఎండీ బేకే ముంధ్రా తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేపట్టాలనే మార్గంలోనే ఆచరణ గావించడానికి రైల్వే శాఖ ముందుకు వస్తే తమ కంపెనీ కూడా అందులో ఒక భాగం కావడానికి సిద్ధమవుతుందని ముంధ్రా తెలిపారు.

రైల్వే శాఖ ప్రతిపాదిస్తున్న మోడల్ సరైనదైతేనే తాము ప్రాజెక్ట్‌ల ప్రక్రియలో భాగం కాగలమని ఆయన ఓ ప్రశ్నకు సమాధనంగా చెప్పారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఒబామా జీతమెంతో తెలుసా...!
రైల్వే బడ్జెట్‌పై ప్రముఖుల ప్రశంస !
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
వాగ్దానాలను నెరవేర్చిన రైల్వేబడ్జెట్ : ప్రధాని
ఆఫ్రికాలోనూ పరుగులెట్టనున్న నానో!
5వందల కోట్లను సమకూర్చుకోనున్న ఎస్ బ్యాంక్