కార్ల తయారీలో దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన మారుతీ సుజుకీ.. స్పోర్ట్స్ యుటిలిటీ సరికొత్త వెర్షన్ వాహనంగా గ్రాండ్ విటారాను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో ఈ కారు ఎక్స్‌షో రూం ధర. రూ. 16.67 లక్షలు నుండి రూ. 17.97 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ఎగ్జిక్యూటివ్ అధికారి (మార్కెటింగ్ మరియు సేల్స్) మయాంక్ పరీక్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మోడల్స్‌లో ఇది కూడా అత్యంత పాప్యులారిటీ సంతరించుకోలగదన్నారు. విభిన్న రకాల వినియోగదారులను ఇది పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుందన్నారు. 2.4 లీటర్లతో పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ వెర్షన్ కారును ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపొందించినట్లు తెలిపారు.
కాగా, ఎంఎస్ఐకి అనుబంధ సంస్థ అయిన సుజుకీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా గ్రాండ్ విటారా యూనిట్లను విక్రయించినట్లు వ్యాఖ్యానించారు. |