రైల్వే బడ్జెట్‌ను ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించింది కాదని రైల్వే శాఖామంత్రి మమత బెనర్జీ అన్నారు.రైలేశాఖామంత్రి మమత బెనర్జీ కేవలం బెంగాల్ కే పరిమతమయ్యేలా బడ్జెట్‌ను రూపొందించారని పలు పార్టీలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... తాను రూపొందించిన రైల్వే బడ్జెట్ ఒక్క బెంగాల్ రాష్ట్రానికే కాదని ఆమె విమర్శలను తిప్పి కొట్టారు.మొత్తం దేశంకోసం ఈ బడ్జెట్‌ను తయారు చేశామని చెప్పారు. తాను దేశం దేశం మొత్తం కోసం పనిచేశానని, ఏ ఒక్కరినీ నిర్లక్ష్యం చేయలేదని ఆమె అన్నారు. బెంగాల్ కోసం ఏమైనా చేసి ఉంటే అది నేరం కాదు అని ఓ మీడియాకూ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ...ప్రైవేటు భాగస్వామ్యంపై వస్తున్న విమర్శలను గురించి మాట్లాడుతూ రైల్వేలను కార్పొరేటీకరించడం లేదు. కాని రైల్వేల అభివృద్ధికి నిధుల లేమి కారణంగా ఈ విధానాన్ని రూపొందించామని ఆమె అన్నారు. భవిష్యత్తులో ఎట్టిపరిస్థితుల్లోనూ రైల్వేలను ప్రైవేటీకరించం. రైల్వే సిబ్బందికి తగిన రక్షణ కల్పించడం నా బాధ్యత అని మమత వ్యాఖ్యానించారు. |