వాస్తవ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి తగ్గుముఖం పట్టింది. దీంతో 2007-08 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 9 శాతం నుండి ప్రస్తుతం 6.7 శాతానికి జీడీపీ వృద్ధి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుతూ కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్ఓ) ఈ వివరాలను తెలిపింది.
వివిధ రంగాల వారీగా జీడీపీ వృద్ధిని చూస్తే.. వ్యవసాయం, అటవీశాఖ, మత్స్య పరిశ్రమల్లో 2007-08 ఆర్థిక సంవత్సరంలో 4.9 శాతంగా ఉండేది. అయితే 2008-09 ఆర్థిక సంవత్సరంలో 1.6 శాతం క్షీణించింది. అంటే.. 2007-08 ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతంగా నమోదైన వృద్ధి.. 2008-09 ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతానికి పడిపోయింది.
ఉత్పత్తి, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణం, సేవలు, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ మరియు ఆర్థిక, భీమా, రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు కూడా క్షీణతనే నమోదు చేశాయి. కానీ గత ఆర్థిక సంవత్సరంలో 13.1 శాతం అత్యధిక వృద్ధిరేటును నమోదు చేశాయి. కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు కూడా తగ్గుముఖం పట్టాయి.
డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయం ఆర్థిక సంక్షోభం, రుణ సౌకర్యాలను విస్తరించడంపై మరిన్ని జాగ్రత్తలు దీంతో వ్యవస్తాయ ఉత్పత్తిపైన ప్రభావం చూపాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఇంత తక్కువ జీడీపీ నమోదు కావడానికి ఇవి కారణాలని తెలిపారు. |