సుస్థిర పాలనను అందించే యూపీఏ సర్కారు ప్రవేశపెట్టబోయే తాజా బడ్జెట్‌పై సర్వత్రా భారీ అంచనాలే నెలకొన్నాయి. స్టాక్ మార్కెట్ మదుపరులలో ఈ ఆతృత మరీ ఎక్కువగా ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నిరుడు ఆర్థిక సంవత్సరంలో వాస్తవ బడ్జెట్ అంచనాల్లో కేంద్ర పన్నుల ఆదాయం నిర్థేశిత లక్ష్యాల కంటే రూ. 78 వేల కోట్ల మేరకు తగ్గింది. మరోవైపు ద్రవ్యలోటు ఆరు శాతానికిపైగా దూసుకుపోయింది. గతంలోలా ఈసారి వామపక్షాల ఇబ్బందులు లేకపోవడంతో బడ్జెట్ రూపకల్పనలో ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీకి మరింత వెసలుబాటు కలగనుంది. ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు పెరిగే అవకాశాలేవీ కనిపించడంలేదు. దీనికితోడు ఆర్థికసర్వే సూచనలు కార్పొరేట్ రంగంపై పన్నుల భారం తగ్గించాలని, సెస్, సర్‌ఛార్జీలను కూడా పూర్తిగా తొలగించాలని పేర్కొంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరుపు బడ్జెట్లో సంక్షేమ పథ కాలకు నిధుల కేటాయింపు తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం సంక్షేమ ధోరణి నుంచి తప్పుకోనప్పటికీ పథకాలను అర్హులకు మాత్రమే చేరే విధంగా కొన్ని కఠినాత్మకమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. |