గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అముల్ ఇంక్)తో ఐబీఎం సంస్థ పదేళ్ళ కాలపరిమితి కలిగిన సమగ్ర ఒప్పందం ఒకదాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు.. జీసీఎంఎంఎఫ్‌కు అవసరమైన సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐబీఎం అందజేస్తుంది. పాల ఉత్పత్తిదారుల యూనియన్లు తమ వ్యాపార కార్యకలాపాలు వృద్ధి చేసుకునేందుకు ఈ ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
అంతేకాకుండా, అముల్ సంస్థకు చెందిన ఐటీ కార్యకలాపాలను వచ్చే పదేళ్ళ పాటు ఐబీఎం నిర్వహిస్తుంది. ఈ ఒప్పందం వల్ల వినియోగదారులతో సంబంధాలు మరింత బలపడటమే కాకుండా, వ్యాపార కార్యకాలాపాలు మరింత వేగవంతంగా సాగేందుకు దోహదపడుతుందని ఐబీఎం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. |