ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > వృద్ధి రేటు 9 శాతం కోసం చర్యలు: ప్రణబ్ ముఖర్జీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వృద్ధి రేటు 9 శాతం కోసం చర్యలు: ప్రణబ్ ముఖర్జీ
2009-10 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్‌లో సమర్పిస్తున్నారు. సోమవారం ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆయన బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని ఆరంభించారు. గత 25 సంవత్సరాల క్రితం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనుభవం ఆయనకు ఉంది. 1982, 83, 84 సంవత్సరాల్లో ఆయన బడ్జెట్‌ను దాఖలు చేసి, అందరి మన్నలు, ప్రశంసలు పొందారు.

తాజాగా, మరోమారు తనుకున్న అపారమైన రాజకీయ అనుభవంతో 2009-10 ఆర్థిక బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. తన బడ్జెట్ ప్రారంభ ప్రసంగంలో వార్షిక వృద్ధి రేటు 9 శాతానికి పెంచే లక్ష్యంగా చర్యలు చేపడుతామని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుస్తామన్నారు.

వ్యవసాయ రంగం ఉన్నతికి మరిన్ని చర్యలు చేపడుతామని చెప్పుకొచ్చారు. పరిశ్రమ, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
అముల్ ఇంక్‌తో ఐబీఎం పదేళ్ళ ఒప్పందం
నేడు విత్తమంత్రి ప్రణబ్ "పద్దుల చిట్టా" వెల్లడి
జూన్‌లో తగ్గిన అశోక్ లేలాండ్ అమ్మకాలు
ప్రస్తుత ఏడాదికూడా పీఎఫ్‌పై 8.5శాతం వడ్డీ
మార్కెట్లో కోడిగుడ్లు ధరలు