ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > బ్రిటన్‌లో పబ్‌లకు ఆర్థిక మాంద్యం తాకిడి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బ్రిటన్‌లో పబ్‌లకు ఆర్థిక మాంద్యం తాకిడి
ఆర్థిక మాంద్యం కోరల్లోకి ఇప్పుడు పబ్‌లు కూడా జారుకున్నాయి. ఆర్థిక మాంద్యం కారణంగా బ్రిటన్‌లో ప్రతివారం 52 పబ్‌లు మూతబడుతున్నాయి. ఈ కారణంగానూ వేలాది మంది నిరుద్యోగం బారినపడుతున్నట్లు బ్రిటీష్ బీర్ అండ్ పబ్ అసోసియేషన్ (బీబీపీఏ) తెలిపింది.

ఆర్థిక ఒత్తిళ్లు, నియంత్రణ భారం కారణంగా సరాసరిన రోజుకు ఏడుకుపైగా పబ్‌‍లు మూసివేస్తున్నట్లు బీబీపీఏ వెల్లడించింది. గత ఏడాది పబ్‌లు మూతబడటంతో సుమారు 24 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. బ్రిటన్‌లోని 98 శాతం పబ్‌లు బీబీపీఏలో సభ్యత్వం కలిగివున్నాయి. బీబీపీఏ సభ్యత్వం ఉన్న పబ్‌లలో 54 వేల మంది పనిచేస్తున్నారు.

గడిచిన 12 నెలల కాలంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా వ్యాపారం తగ్గిపోవడంతో 2377 పబ్‌లు మూతబడ్డాయి. ఈ పబ్‌లు మూతపడటంతో వీటిలో పనిచేస్తున్న 24 వేల మంది నిరుద్యోగులయ్యారు. గత మూడేళ్ల కాలంలో మొత్తం 5134 పబ్‌లు మూసివేశారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 53,466 పబ్‌లు నిర్వహణలో ఉన్నట్లు బీబీపీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఐదింతలు పెరిగిన లాభాలు: కెనరాబ్యాంక్
ఉద్యోగులను తొలగించనున్న కాంటినెంటల్
నిర్మాణ రంగంలో నాలుగువేల కోట్ల పెట్టుబడి: అంబుజా
12శాతం లాభాలు పెంచుకున్న విప్రో
ఇక తపాలాశాఖలకు హైటెక్ హంగులు
నిరుడు రికార్డు స్థాయిలో గోధుమల ఉత్పత్తి