రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.210గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.40గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.211 గాను, విజయవాడలో రూ.210, విశాఖపట్నంలో రూ.230, గోదావరి మార్కెట్‌లో రూ.210, తూర్పుగోదావరిలో రూ.210, చిత్తూరులో 230 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.237 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 234 రూపాయలుగా పలుకుతోంది. |