ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > లాభాలు పొందిన బ్యాంక్ ఆఫ్ బరోడా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లాభాలు పొందిన బ్యాంక్ ఆఫ్ బరోడా
దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాంతానికి 85శాతం లాభాలను ఆర్జించింది.

దేశీయ బ్యాంకింగ్ రంగంలో ప్రముఖమైన బ్యాంక్ ఆఫ్ బరోడా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాంతానికి 85శాతం లాభాలు పెరిగి రూ.685.38కోట్లకు చేరుకుంది.

నిరుడు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాంతానికి బ్యాంక్ నికర లాభాలు రూ. 370.86కోట్లుగా ఉండింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికాంతానికి బ్యాంక్ నికర ఆదాయం రూ. 4,735.15కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 3,806.37కోట్లుగా ఉండిందని బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.

ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాంతానికి తమ బ్యాంక్ వడ్డీల రూపంలో రూ. 4,032.11కోట్లు వసూలు అయినట్లు బ్యాంక్ తెలిపింది. కాగా నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 3,293.82కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో వసూలైనట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో వివరించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లాభాలు పొందిన గోద్రేజ్
హిమాలయా ఇంటర్నేషనల్ టార్గెట్ వందకోట్లు
లాభాలు రెండింతలు పెంచుకున్న జేకే సిమెంట్స్
లాభాలబాటలో ఎస్‌బీఐ
భారత్ 9శాతం వృద్ధిని సాధిస్తుంది: ప్రణబ్
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు