సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » దక్షిణ భారత మార్కెట్‌లో "గల్లా" మ్యాంగో జ్యూస్ (market | Fruit Drinks | Galla Foods | Jay Galla |)
 
Srini
WD
దక్షిణ భారత్ ఫ్రూట్ జ్యూస్ మార్కెట్‌లోకి గల్లా ఫుడ్స్ కూడా ప్రవేశించింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో గల్లా ఫుడ్స్ సంస్థ నుంచి తయారైన గల్లా మ్యాంగో జ్యూస్‌ను ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ జయ్ గల్లా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ మ్యాంగో జ్యూస్ క్లాసికల్ మ్యాంగో, యాపిల్ లిట్చి అనే రెండు రకాల్లో ప్రవేశపెట్టారు.

దక్షిణ భారత దేశంలో సంవత్సరం పొడవునా ఈ జ్యూస్ అన్ని కిరాణా షాపుల్లో లభ్యమవుతుందని చెప్పారు. గల్లా మ్యాంగో జ్యూస్‌ను 275 మిల్లీ లీటర్లలో తొలిసారిగా ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఒక 275 మిలీ మ్యాంగో ప్యాక్ ధర రూ.12 గాను 550 ఎంఎల్ ధర రూ.22గా నిర్ణయించారు. అలాగే, యాపిల్ లిట్చి ధర రూ.13, 24గా నిర్ణయించినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు.

వచ్చే ఐదేళ్ళలో తమ మార్కెట్ విలువను దేశ వ్యాప్తంగా పది శాతానికి పెంచుకోవడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. మ్యాంగో జ్యూస్‌కు అవసరమైన మామిడి పండ్ల సేకరణ కూడా తామే ఎంపిక చేసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని మామిడి రైతుల నుంచి 80 శాతం, మిగిలిన 20 శాతం పండ్లను మండీల నుంచి పండ్లను సేకరిస్తామని చెప్పారు.

దేశంలో ఫ్రూట్ డ్రింక్ మార్కెట్ ఫ్రూట్ జ్యూస్ మార్కెట్ 76 శాతంగా ఉందన్నారు. అలాగే, దక్షిణ భారత దేశంలో ఈ మార్కెట్ విలువ
Srini
WD
92 శాతంగా ఉందని జయ్ వివరించారు. రైతుల నుంచి మామిడి పండ్ల సేకరణ మొదలుకుని... వాటిని ఫ్రూట్ జ్యూస్‌గా మార్చే ప్రక్రియ వరకు తమ సంస్థలోనే జరుగుతుందని తెలిపారు. ఫలితంగా వినియోగదారులకు మెరుగైన, నాణ్యవంతమైన మ్యాంగో ఫ్రూట్ జ్యూస్‌ను అందించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


గత 2005 సంవత్సరంలో ప్రారంభమైన గల్లా ఫుడ్స్ సంస్థ.. యూరప్ వంటి దేశాలకు పండ్లను ఎగుమతి చేస్తూ వస్తోంది. గత యేడాది గల్లా మామిడి పండ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన ఈ సంస్థ ప్రస్తుతం స్వదేశీ మార్కెట్‌లో సైతం కాలుమోపింది. తాజాగా ప్రవేశపెట్టిన మ్యాంగో జ్యూస్ టెట్రా ప్యాక్ లేదా బెట్ బాటిల్స్‌లో మార్కెట్‌లో లభ్యమవుతాయని చెప్పారు. ఇందుకోసం తమ సంస్థ యాభై కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టినట్టు జయ్ గల్లా వివరించారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.