సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త హోమ్ లోన్ ఆఫర్ (Finance | ICICI Bank | New Home Loan offer | August 20)
 
ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ కొత్త గృహ రుణాల పథకాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ తన ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త ఆఫర్ కింద.. రూ. 20 లక్షల వరకు గృహ రుణం కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి.. 8.75 శాతం వడ్డీ రేటుతో రుణాన్ని మంజూరు చేస్తారు.

ముంబైలో ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ, ఆగస్ట్ 20వ తేదీ నుంచి ఈ పథకాలను అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు. రుణాలు రూ. 20 నుంచి రూ. 50 లక్షల మధ్య ఉంటే.. 9.25 శాతం వడ్డీ రేటుతో అందిస్తున్నట్లు వివరించారు.

ఒక వేళ రూ. 50 లక్షలు దాటిన రుణాలకు.. 9.75 శాతం వడ్డీ రేటు వద్ద రుణాలు ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్‌ను మినహాయిస్తే.. సాధారణంగా.. ఈ బ్యాంకులో 9.25 నుంచి 11 శాతం మేరకు గృహ రుణ వడ్డీ రేట్లున్నాయి.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.