దేశీయ మోటార్ వాహనాల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న టాటా మోటార్స్ మళ్ళీ నిధుల సమీకరణ చేయనుంది.
టాటా మోటార్స్ సంస్థ మళ్ళీ రూ. 1500 కోట్ల నిధుల సమీకరణ చేయనుంది. ఒకే ఏడాదిలో అతి తక్కువ సమయంలో ఎఫ్‌డీల రూపంలో ప్రజలనుంచి రుణ సమీకరణకు ప్రయత్నించడం ఇది రెండవసారి.
మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.88శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తుంది. నిధుల సమీకరణలో భాగంగా రూ. 1, 500కోట్లు సమీకరించనుందని కంపెనీ ప్రకటించింది.
కంపెనీ ప్రకటించిన ప్రకారం త్రైమాసిక ఆదాయ ప్రణాళిక ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధికి ఇరవై వేల రూపాయల కనీస ఎఫ్‌డీకి ఎనిమిది శాతం వడ్డీ, ఇదే మొత్తానికి మూడు సంవత్సరాల వ్యవధికి 8.75 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది.
ఇదే క్యుములేటివ్ డిపాజిట్ ప్లాన్ కింద టాటా మోటార్స్ మరో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ క్రింద ఇరవై వేల రూపాయల కనీస మొత్తంపై రెండు సంవత్సరాలకైతే 8.58 శాతం వడ్డీ, మూడు సంవత్సరాలకైతే 9.88 శాతం వడ్డీని చెల్లిస్తామని కంపెనీ ప్రకటించింది.