సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » వ్యవసాయ ఉత్పత్తులు తగ్గొచ్చు : శరద్ (Poor monsoon | Food and Agriculture Minister | Sharad Pawar | Kharief |)
 
FILE
దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ తెలిపారు.

దేశంలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడాది వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతాయని, ఈ సందర్భంగా కరవు నెలకొన్న జిల్లాల్లో రైతుల నుంచి రుణాల వసూళ్ళ గురించి ఒత్తిడి తీసుకురావద్దని ఆయన బ్యాంక్ వర్గాలకు సూచించారు.

ఈ ఏడాది ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతాయని, ఖరీఫ్‌లో ఉత్పత్తులు జరగని కారణంగా ఈ ప్రభావం రబీలో ఉత్పత్తులు ఎలా ఉంటాయోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

నిరుడు ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో 1.6 శాతం వృద్ధి సాగిందని ఆయన గుర్తు చేశారు.

గతంలో రైతులు ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో వారిలో రుణాల రికవరీ కొరకు కరవు నెలకొన్న జిల్లాల్లోని రైతులనుంచి రుణాల రికవరీ గురించి వారిని ఇబ్బంది పెట్టకండని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా దాదాపు 600కు పైగా జిల్లాలు కరవు పీడిత జిల్లాలుగా ప్రకటించామని, ఈ జిల్లాల్లోనున్న రైతులనుంచి రుణ వసూళ్ళను ఆపాలని ఆయన సెంట్రల్ బ్యాంక్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.