దేశీయ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థనుంచి రూ. 190 కోట్ల కాంట్రాక్ట్‌ను పొందింది. భెల్ పొందిన ఈ కాంట్రాక్టుతో అసోంలో గ్యాస్‌కు సంబంధించిన క్యాప్టివ్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనుందని భెల్ అధికార వర్గాలు తెలిపాయి.
అసోంలో ఓ గ్యాస్‌తో కూడుకున్న క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను స్థాపించేందుకు ఆయిల్ ఇండియాతో దాదాపు రూ. 190 కోట్ల కాంట్రాక్టును పొందినట్లు కంపెనీ ప్రకటించింది.
కాంట్రాక్టులో భాగంగా భెల్ ద్వారా సంపూర్ణమైన క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కొరకు డిజైన్, ఇంజనీరింగ్ సెక్టార్‌కు చెందిన తదితర పనులను పూర్తి చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.