జపాన్ దేశానికి చెందిన ఐటీ బిజినెస్ సొల్యూషన్ రంగానికి చెందిన కంపెనీ ఫుజిత్సు సంస్థ ఉద్యోగులను తొలగించునుంది.
ఆర్థిక మాంద్యం కారణంగా ఫుజిత్సు సంస్థకు ఆదాయం తక్కువవ్వడంతో తన సంస్థకు చెందిన బ్రిటన్‌లోని కార్యాలయంలో పని చేస్తున్న 1200మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
గతంలో ఊహించినదానికంటే ఆదాయం తగ్గడంతో ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని సంస్థ తెలిపింది.
ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కారణంగా ఓ వైపు వ్యాపార రంగంలో పోటీ నెలకొనడంతో తమ ఖర్చులుకూడా పెరిగిపోయాయని కంపెనీ పేర్కొంది.
మాంద్యంతో అతలాకుతలమౌతున్న నేటి తరుణంలో తమ సంస్థకు చెందిన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకుని, భవిష్యత్తులో వికాసమార్గంలో పయనించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సంస్థ తెలిపింది.