చక్కెర ధరలను అదుపు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కేంద్ర వ్యవసాయ శాఖామంత్రికి లేఖ రాశారు.
దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె చక్కెర ధరలను నియంత్రించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్‌కు ఓ లేఖ రాశారు.
గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా చక్కెర ధరలు చుక్కలు చూపిస్తున్నాయంటూ, దీనిని నియంత్రించాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. చక్కెర దేశంలోని ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువని, కాబట్టి చక్కెర ధరలను నియంత్రించే మార్గం ఆలోచించి ధరలను అదుపు చేయాలని ఆమె తన లేఖలో సూచించారు.