దేశంలోనే ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ టాటా స్టీల్.. జూన్ 30, 2009తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ. 2,238.53 కోట్ల మేరకు నికర నష్టాన్ని చవిచూసినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 3,914.62 కోట్లు మేరకు నికర ఆదాయం వచ్చినట్లు టాటా స్టీల్ వెల్లడించింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌కు చేసిన ఫైలింగ్‌లో టాటా స్టీల్ ఈ వివరాలు పేర్కొంది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 23,292.31 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. కానీ, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 43,496.17 కోట్లు మేరకు నికర ఆదాయం వచ్చినట్లు టాటా స్టీల్ వివరించింది.
ప్రస్తుతం బీఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్‌లో టాటా స్టీల్ షేర్ ధర రూ. 438.90 వద్ద ట్రేడ్ అవుతోంది. గత ముగింపు కన్నా ప్రస్తుతం 4.60 శాతం మేరకు టాటా స్టీల్ షేర్ ధర ఉంది.