గడచిన మూడు వారాలలో భారత మార్కెట్ దిగుమతి దారులు బ్రెజిల్ నుంచి దాదాపు తొమ్మిది లక్షల టన్నుల చక్కెరను దిగుమతి చేసుకున్నారు.
దేశీయ చక్కెర దిగుమతి దారుల వద్ద గత మూడు వారాలలో దాదాపు తొమ్మిది లక్షల టన్నుల చక్కెర ఉన్నట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. తొలుత వారివద్ద ఐదు లక్షల టన్నుల చక్కెర ఉన్నట్లు అధికారులు భావించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చక్కెర ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో విదేశాలనుంచి చక్కెరను దిగుమతి చేసుకున్నట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. గడచిన నలభై సంవత్సరాలలో ఇలాంటి వర్షాభావం ఏర్పడలేదని వారు అన్నారు.
నిరుడు దేశంలో 1.48 కోట్ల టన్నుల చక్కెర ఉత్పత్తైంది. కాని ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పోవడంతో వార్షాభావ పరిస్థితులు తలెత్తాయి. దీంతో చక్కెర ఉత్పత్తులు 20 లక్షల టన్నులు తగ్గాయని వ్యాపార వర్గాలు చెపుతున్ననాయి.
ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చక్కెర ఉత్పత్తులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దీంతో 1.7 కోట్ల టన్నులకు చేరుకోగలదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.