సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మాంద్యంతో విద్యుత్‌ ఆదా చేస్తున్న ఆమెరికా (Financial Crisis | Savings | America | City | Energy Conservation | Street Lights)
 
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా అనేక దేశాలు రకరకాల పొదుపు సూత్రాలను పాటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్థిక రంగంలో అగ్రరాజ్యమైన అమెరికా ఇప్పుడు కొత్త విధానాన్ని అవలంబిస్తోంది.

డబ్బుని ఆదా చేయడానికి నగరాలు, పట్టణాల్లోని వీధి దీపాలను ఆపేసే చర్యలు విస్తరించనుంది. ఖర్చులు తగ్గించుకునే విషయంలో భాగంగా వీధి దీపాలు ఎంత సేపు వెలగాలనే సమయంలో మార్పు తీసుకు వచ్చారు. వీధి దీపాలు ఎక్కువ సేపు వెలగడంతో అధిక శక్తి ఖర్చవుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

వీధి దీపాలు వెలిగే సమయాన్ని తగ్గించుకుంటే వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణంలో తలెత్తే మార్పులను కూడా నివారించవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు బెల్మోంట్‌, కాలిఫోర్నియా, మార్ఫా, టెక్సాస్‌, తదితర మున్సిపాలిటీలో వీధి దీపాలను ఆపేస్తున్నారని అక్కడి అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఇదే కోవలో పలు కంపెనీలు డబ్బుని ఆదా చేయడానికి, లైట్లు ఆపే ప్రయత్నంలో ఉన్నాయి. దీంతో ఖర్చును తగ్గించుకోవడంలో ఇది తేలికైన పరిష్కార మార్గంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు.

తొలుత అమెరికాలోని హాస్టన్‌కు చెందిన గృహ యజమానులు, అద్దె దారులు నిరుడు ఈ నూతన విధానానికి నాంది పలికారు. నగర వ్యాప్తంగా ‘ఎనర్జీ క్యాపిటల్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ ఎనర్జీ కన్‌సర్వేషన్‌ క్యాపిటల్‌ సనాటా రోజా, కాలిఫ్‌, తదితర ఆరువేల నగరాల్లో 15,000 వేల వీధి దీపాలను తీసివేసింది.

అదనంగా 3 వేల ఇతర ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి ఉదయం 5.30 వరకు దీపాలను ఆపేస్తున్నారు. దీంతో ఏడాదికి 4 లక్షల డాలర్లను ఆదా చేసినట్లౌతోందని అక్కడి అధికారవర్గాలు వెల్లడించాయి.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.