భారత్‌లో గ్యాస్ విక్రయాల గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు పూర్తి మార్కెటింగ్ స్వేచ్ఛ ఉందని ఆర్ఎన్ఆర్ఎల్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిటడ్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ముఖేష్ అంబానీ సంస్థతో ఓ ఒప్పందం కుదుర్చుకుందని అందువల్ల గ్యాస్ వినియోగంపైనగాని గ్యాస్ ధర స్థిరీకరణ గురించి కాని ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదని ఆయన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
తమ స్వేచ్ఛ పరిధిలో మార్కెటింగ్ స్వేచ్ఛ చేరి ఉందని ఆర్ఐఎల్ తనకు సరైన రీతిలో అనిపించిన మేరకు గ్యాస్‌ను విక్రయించుకునే స్వేచ్ఛ ఉందని ఒక అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆర్ఐఎల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ అఫిడవిట్ సమర్పించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వైఖరిని మార్చుకుంటూ వస్తోందని కుటుంబ అవగాహనా ఒప్పందం ప్రకారం ఆర్ఐఎల్ నడచుకోవటం లేదని అనిల్ ఈ సందర్భంగా అన్నారు.