దేశవ్యాప్తంగానున్న ఆంధ్రా బ్యాంకు శాఖల్లో పని చేస్తున్న దాదాపు 7,500 మంది అధికారులు శుక్రవారం సమ్మె చేయనున్నారు.
ఆంధ్రాబ్యాంక్ యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణికి నిరసనగానే తాము ఈ సమ్మె చేస్తున్నట్లు అఖిల భారత ఆంధ్రా బ్యాంక్ అధికారుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రా బ్యాంకుకు దేశవ్యాప్తంగా 1500 శాఖలున్నాయి.
యాజమాన్యం అధికారులను ఇష్టానుసారంగా సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడంలాంటి చర్యలకు పాల్పడుతోందని సంఘం ఆరోపించింది. దీంతో శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా తాము సమ్మె చేయనున్నట్లు అధికారుల సంఘం ప్రకటించింది.