ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » కోల్ ఇండియా వాటాలను అమ్మేందుకు సిద్ధం: కేంద్రం (Coal India | Disinvestment | Central Government | Shriprakash Jaiswal)
ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్‌లో దాదాపు 10 శాతం వాటాను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ రంగానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థలోని ప్రభుత్వ భాగస్వామ్యంలోని వాటాలో దాదాపు 10 శాతం అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణియించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి శ్రీ ప్రకాష్ జైస్వాల్ వెల్లడించారు.
తాము విక్రయించదలచుకున్న వాటా కొత్త షేర్ల రూపంలో కాదని, ప్రభుత్వపు వాటాను మాత్రమే విక్రయించాలని నిర్ణయించినట్లు ఆయన అన్నారు. మూడు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియాకు నవరత్న హోదాను కల్పించిందన్నారు. ఈ నేపథ్యంలోని కంపెనీని మూడు సంవత్సరాలలోపు షేర్ మార్కెట్లో పొందుపరచాల్సి ఉందన్నారు.
మళ్ళీ తమ ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరంలో పెట్టుబడులు పెట్టగలదన్నారు. షేర్ల రూపంలో కార్మికులు మరియు కంపెనీకి అవసరమైన భూమిని ఇచ్చేవారికే తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు.