సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » నియాకాలు చేపట్టనున్న స్టాండర్డ్ చార్టర్డ్ (Standard charterd Bank | Current year | India | 2 thousand appointments)
 
FILE
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో దాదాపు రెండు వేల మందిని నియమించనున్నట్లు స్టాండర్డ్ చార్టర్డ్ తెలిపింది.

స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు వెలమందిని నియమించనుందని బ్యాంక్‌కు చెందిన ఉన్నతాధికారి శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగానున్న తమ శాఖల్లో దాదాపు ఎనిమిది వేలమంది ఉద్యోగులున్నారని ఆయన తెలిపారు.

తమ బ్యాంక్‌కు చెందిన కేపీఓ నెటవర్క్ స్కోప్ ఇంటర్నేషనల్‌కు చెందిన ఓ కార్యాలయాన్ని వచ్చే నెలలో బెంగుళూరులో ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రస్తుతం స్కోప్ ఇంటర్నేషనల్‌కు చెందిన కార్యాలయాలు మలేషియా, చైనా మరియు చెన్నైలలోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెన్నైలోనున్న కార్యాలయంలో ప్రస్తుతం ఏడువేల మంది ఉద్యోగులున్నట్లు ఆయన చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.