ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » టాప్స్‌గ్రూప్ ఛైర్మెన్‌కు యువ వ్యాపార వేత్త అవార్డు (Young Business Leader | award | India Business Awards 2009 | UK Trade Investment | India’s private security industy)
టాప్స్‌గ్రూప్ ఛైర్మెన్‌కు యువ వ్యాపార వేత్త అవార్డు
FILE
టాప్స్‌గ్రూప్ ఛైర్మెన్ డాక్టర్. దీవాన్ రాహుల్ నందా 2009వ సంవత్సరానికిగాను యూకే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండియా బిజినెస్ అవార్డ్‌ను పొందినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ అవార్డు యువ వ్యాపార వేత్త కేటగిరీకి చెందినదని ఆయన తెలిపారు.
యూకే మరియు ఇండియాలోనున్న కంపెనీల వ్యాపార సరళిని పరిశీలించి ఈ అవార్డును ఇస్తారని, ఇరు దేశాల మధ్య జరుగుతున్న వ్యాపార లావాదేవీల స్థితిగతులననుసరించి యూకే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండియా బిజినెస్ అవార్డులను ఇస్తారని ప్రతినిధి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్. నందా విలేకరులతో మాట్లాడుతూ...అవార్డు రావడం తనకెంతో ఆనందంగా ఉందని, ఇది కేవలం తమ సంస్థకే కాదని, దేశంలోని సెక్యూరిటీ ఇండస్ట్రీస్‌కే గర్వకారణమని ఆయన అన్నారు.
దేశంలోని సెక్యూరిటీ ఇండస్ట్రీస్‌కే ఇది తొలి అవార్డని ఆయన తెలిపారు. గతంలో ఈ అవార్డు దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలైన అజీమ్ ప్రేమ్‌జీ, డాక్టర్. విజయ్ మాల్యా, నరేష్ గోయల్, కే.వీ. కామత్ తదితరులు కూడా పొందారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.