ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » '8" సిరీస్‌తో ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్ (Airtel | telecommunications | telecommunications company | Rajasthan | new number | New Mobile Code)
ఆసియా టెలికాం రంగంలో అగ్రగామిగానున్న ఎయిర్‌టెల్ సంస్థ రాజస్థాన్ రాష్ట్రంలో "8" సిరీస్‌తో కొత్త మొబైల్ నంబర్‌ను వినియోగిదారులకు అందించింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని మొబైల్ వినియోగదారులకు కొత్తగా తీసుకునే ఎయిర్‌టెల్ సిమ్ కార్డులకు "8" నెంబర్‌తో ప్రారంభమయ్యే విధంగా తాము కొత్త నెంబర్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు భారతీ ఎయిర్‌టెల్ ప్రధాన అధికారి (మొబైల్ సేవలు) విశాల్ సెహ్‌గల్ తెలిపారు. ప్రస్తుతం తాము వినియోగదారులకు అందిస్తున్న కొత్త నెంబర్ కోడ్ "8003"తో ఇచ్చే తొలి మొబైల్ కంపెనీ తమదేనని ఆయన తెలిపారు.
రాజస్థాన్ రాష్ట్రంలో ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఇకపై కొత్తగా "8" సంఖ్యతో మొబైల్ నెంబర్ లభిస్తుందని, దీనికి ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయట్లేదని ఆయన తెలిపారు.
భారతీ ఎయిర్‌టెల్ గ్రూపుకు చెందిన భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ సంస్థ భారత్, శ్రీలంక దేశాలలో మొబైల్ సేవలను అందిస్తోందని ఆయన తెలిపారు. గత జులై నెలకి దాదాపు 1080 లక్షలమంది వినియోగదారులున్నారని, వీరిలో 1050.18 లక్షల మొబైల్ వినియోగదారులున్నారని ఆయన వివరించారు.