సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » అబెంగొవా సోలార్‌తో ఒప్పందం చేసుకున్న ఎమ్ఆర్ఈఎల్ (Maharishi Solar Technology | technology transfers | training | industrial ventures | Emiliano Garcia)
 
అంతర్జాతీయ సంస్థ అయిన అబెంగొవా సోలార్ ఇన్క్ (ఏఎస్ఐ) మహర్షీ గ్రూప్‌కు చెందిన మహర్షీ సోలార్ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం చేసుకుంది.

తాము చేసుకున్న ఒప్పందంలో భాగంగా అబెంగొవా సోలార్ సంస్థ తమ సంస్థలోని ఉద్యోగులకు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్స్, శిక్షణ (ట్రైనింగ్) ఇవ్వడంలో ఈ సంస్థ తమకు తోడ్పాటునందిస్తుందని మహర్షి రెన్యూవబుల్ ఎనర్జీ (ఎమ్ఆర్ఈఎల్) ఎమ్‌డీ ప్రదీప్ ఖన్నా చెన్నైలో తెలిపారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ సౌరశక్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి పరిచయం చేస్తున్నామని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రిమోట్ మోనిటరింగ్ మరియు డయాగ్నోస్టిక్స్‌లో వివిధ రకాల ధరలుంటాయని, ఇది దేశీయ పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడగలదని ఆయన అన్నారు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన అబెంగొవా సోలార్ ఇన్క్ కంపెనీతో తాము ఒప్పందం చేసుకోవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని, దీంతో ఉత్తమమైన సోలార్ ఎనర్జీని పలు దేశీయ కంపెనీలకు అందిస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశీయ పరిశ్రమలు ఆవిరి శక్తిని ఉపయోగిస్తున్నారు. ఈ ఆవిరి శక్తి దేశీయ పరిశ్రమలకు ఇది ఎంతో లాభదాయకంగా ఉంటోంది. దీనికన్నాకూడా సౌరశక్తిని ఉపయోగిస్తే మరింత లాభం చేకూరుతుందని ఆయన వివరించారు.

ధర పరంగాకూడా తాము అందించే సౌరశక్తి ధరలు చాలా తక్కువేనని ఆయన వెల్లడించారు. దీంతో రానున్న రోజుల్లో వచ్చే ఇంధన ధరల హెచ్చుతగ్గులనుంచి కంపెనీలు బయటపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అబెంగొవా సోలార్ సంస్థతో తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం సరియైన టెక్నాలజీని ఉపయోగించి దీనిని సద్వినియోగం చేసుకునేలా రూపొందిస్తుందని మహర్షి మహేళ్ యోగీ సంస్థ తెలిపింది. సాంకేతికపరంగా తాము అందించే సౌరశక్తితో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ఆయన అన్నారు.

భారతదేశంలోని పలు కంపెనీలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగినవిగా అబెంగొ సోలార్ సంస్థకు చెందిన జనరల్ మేనేజర్ ఏమిలియానో గార్సియా అన్నారు. భారత్ గ్లోబల్ హబ్ అని ఆయన కొనియాడారు. తాము భారతదేశంలోకి అడుగుపెట్టడానికి మహర్షి సోలార్ సంస్థ తమకు మంచి తోడ్పాటునందించిందని, దీంతో తాము మరింత ముందుకు దూసుకువెళ్ళగలమని ఆయన అన్నారు.

దేశీయ మహర్షి సోలార్ టెక్నాలజీకి తాము అన్నివిధాలా సహకరిస్తామని ఆయన వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్నాన్ని వారికి అందిస్తామని ఆయన అన్నారు. తమ రెండు సంస్థలు కలిసి సౌరశక్తిని అభివృద్ధి చేసి దేశీయ పరిశ్రమలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.