సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మాంద్యంనుంచి బయటపడనున్న ఆసియా: ఐఎమ్ఎఫ్ (International Monetary Fund | economic slowdown | Asia | economy)
 
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం త్వరలో మాంద్యంనుంచి బయట పడనుందని, ఇందులో ప్రథమంగా ఆసియా ఉంటుందని ఐఎమ్ఎఫ్ తెలిపింది.

ఆర్థికమాంద్యం మళ్ళీ తలెత్తే పరిస్థితి లేదని తొలుత మాంద్యంనుంచి బయటపడేది ఆసియానేనని ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థికమాంద్యం తగ్గుముఖం పడుతోందని ఆయన బుధవారం తెలిపారు.

ఇటీవల విడుదలైన లెక్కల ప్రకారం మాంద్యం బారిన పడిన దేశాలు కోలుకుంటున్నట్లు తమకు సమాచారం వస్తోందని ఆయన వివరించారు. కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు పురోగతిని సాధిస్తున్నాయని ఆయన తెలిపారు.

ఆర్థికంగా మళ్ళీ పుంజుకుంటున్న దేశాలు ఆసియాలోనే ఉన్నాయని, కాని అమెరికా మరియు పశ్చిమ యూరోప్ దేశాలు కూడా మాంద్యం నుంచి బయట పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. మరోవైపు నిరుద్యోగ సమస్య మరింత జఠిలమౌతోందని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థలో మార్పులు ప్రస్తుతం హెచ్చుతగ్గులుగా ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ మాంద్యంబారిన పడే అవకాశాలున్నట్లు ఆర్థిక నిపుణలు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఆర్థిక రంగం పరిస్థితి దయనీయంగా మారిందని, కాని మాంద్యం నుంచి బయట పడేందుకు తగిన సమయం పడుతుందని కాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.