సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » భారత్‌లో తగ్గనున్న బియ్యం ఉత్పత్తులు (India | rice production | drought | New Delhi | Agriculture Department)
 
FILE
భారతదేశంలో వర్షాభావం కారణంగా కరవు పరిస్థితులు నెలకొనడంతో భారతదేశంలో బియ్యం ఉత్పత్తులు తగ్గే సూచనలున్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం బుధవారం తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో బియ్యం ఉత్పత్తులు దాదాపు 1.7 కోట్ల టన్నులు తగ్గనున్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం బుధవారం ప్రకటించింది.

అమెరికా వ్యవసాయ విభాగం విడుదల చేసిన యూఎస్‌డీఏ నివేదికలో తెలిపిన వివరాలననుసరించి... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఉత్పత్తులు కేవలం 8.2 టన్నులు మాత్రమే జరగవచ్చని పేర్కొంది. ఇది నిరుడు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.7 కోట్ల టన్నుల బియ్యం తక్కువని వ్యవసాయ విభాగం తెలిపింది. దీనికంతటికీ కారణం దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులేనని ఆ విభాగం అనుమానం వ్యక్తం చేసింది.
FILE


దేశంలోని పలు ప్రాంతాలలో జులై-ఆగస్టు నెలలో వర్షాభావం తలెత్తడంతో ఈ పరిస్థితి వచ్చిందని, ఇది ఖరీఫ్ సీజన్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని ఆ విభాగం తెలిపింది. వర్షాభావం కారణంగా వరి నాట్లు నాటే కార్యక్రమం 62 లక్షల హెక్టార్ల మేరకు తగ్గిపోయింది.

ఇదిలావుండగా వరినాట్లు ఆగస్టు నెల చివరికల్లా పూర్తవుతాయి. కాని వర్షాభావం కారణంగా వరినాట్లు తగ్గిందని అమెరికా వ్యవసాయ విభాగం వివరించింది. ఆగస్టు నెల చివరినాటికి వర్షపాతం 25 శాతంకన్నా తక్కువగానే నమోదైంది.

సెప్టంబర్ నెలలో కురుస్తున్న వర్షాలతో రానున్న రోజుల్లో మిగిలిన పంటల దిగుబడి మెరుగ్గానే ఉంటుందని ఆ విభాగం ఆశాభావం వ్యక్తం చేసింది. కాని వరినాట్ల పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు వ్యవసాయ క్షేత్ర నిపుణలు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.