ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » బిజినెస్ అవార్డు పొందిన టాటా స్టీల్ (Tata Steel | New Delhi | UK | Trade and Investment India Business Awards)
"కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీస్ " పేరుతో యూకే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా బిజినెస్ 2009 అవార్డ్‌ను టాటా స్టీల్ అందుకుంది.
కార్పోరేట్ సేవల రంగంలో తాము అందించిన సేవలకుగాను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీస్ పేరుతో తమకు యూకే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా బిజినెస్ 2009 అవార్డ్ దక్కిందని టాటా స్టీల్ కంపెనీ ప్రకటించింది.
ప్రధానంగా ఈ అవార్డు తమ కంపెనీకి రావడానికి కార్పోరేట్ సేవల ఉపాధ్యక్షుడు పార్థసేన్‌గుప్తా, చీఫ్ కార్పోరేట్ సస్టేనబిలిటీ సర్వీసెస్ సతీష్ పిళ్ళైల సహకారమే కారణమని కంపెనీ వెల్లడించింది.
యూకే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా బిజినెస్ అవార్డ్‌ను తొలుత 2005లో ఢిల్లీలో అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ ప్రారంభించారు.