సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » జీఎస్‌టీ జాబితా: కేంద్రం, రాష్ట్రాల సంప్రదింపులు (Pranab | GST | New Indirect tax regime)
 
ప్రతిపాదిత వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావాల్సిన అంశాలపై చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకోనున్నారు.

ఈ సందర్భంగా జీఎస్‌టీ జాబితాలో చేర్చాల్సిన వస్తువులు, సేవలను ఖరారు చేసే అవకాశం ఉంది.

కొత్త పరోక్ష పన్ను విధానానికి మూలం కాబోతున్న ప్రతిపాదిత జీఎస్‌టీలో చేర్చే అంశాలతోపాటు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ఉద్దీపనల భవితవ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే నెలలో ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరుపుతాయి.

అక్టోబరు 8న ఈ కీలక సమావేశం జరుగుతుంది. జీఎస్‌టీ రూపంలో రెండు ప్రామాణిక రేట్లు ఉంచాలని రాష్ట్రాలు నిర్ణయించినట్లు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల గ్రూపు ఛైర్మన్ ఆసిం దాస్‌గుప్తా తెలిపారు.

కొత్త పన్ను వ్యవస్థలో ప్రామాణిక రేటుతోపాటు, నిత్యావసర వస్తువులకు కనిష్ట రేటు ఉండాలని తాము నిర్ణయించామన్నారు. అంతేకాకుండా విలువైన వస్తువులతో కూడిన చిన్న జాబితాకు ప్రత్యేక రేటు ఉంచాలని భావిస్తున్నామన్నారు.

కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పన్ను విధానానికి మూలమైన జీఎస్‌టీలో ఉంచాల్సిన వస్తువులు, సేవల జాబితాను ఇప్పటికీ ఖరారు చేయాల్సివుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.