సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » జీ-20 సదస్సుకు వెళ్లనున్న ప్రధాని మన్మోహన్ (G 20 summit | America | PM Manmohan | Barak Obama | Montek Singh | MK Narayanan | Economic recovery)
 
భారత ప్రధాని మన్మోహన్ సింగ్.. జీ- 20 సదస్సు కోసం బుధవారం అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. ఫైనాన్షియల్ మార్కెట్‌లో నిబంధనలు బలోపేతం చేయడం కోసం మరియు వేగవంతమైన అంతర్జాతీయ ఆర్థిక రికవరీకి చేపట్టవలసిన చర్యలు వంటి అంశాలను ఈ జీ- 20 సదస్సులో ప్రధాని చర్చించనున్నారు.

మన్మోహన్‌తో పాటు ప్రణాళిక కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లూవాలియా, జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌లు కూడా ఈ సదస్సుకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 24 నుంచి 25వ తేదీ వరకు ఈ జీ- 20 సదస్సు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా నేతృత్వంలో పిట్స్‌బర్గ్‌లో నిర్వహించనున్నారు.

ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలే కాకుండా.. జీ- 8 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన అధికారులు కూడా ఈ సదస్సుకు రానున్నారు. కాగా, అంతర్జాతీయ జాతీయ స్థూల ఉత్పత్తి (గ్లోబల్ జీడీపీ)లో 90 శాతం వరకు భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్‌లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైన తర్వాత ఈ సదస్సును మూడోసారి నిర్వహిస్తున్నారు. గత సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలు అయ్యాయి..? ఎంత వరకు సత్ఫలితాలనిచ్చాయి..? అనే విషయాలపై తాజాగా జరుగనున్న సదస్సులో సమీక్షించనున్నారు.జీ-20 సదస్సుకు వెళ్లనున్న ప్రధాని మన్మోహన్

భారత ప్రధాని మన్మోహన్ సింగ్.. జీ- 20 సదస్సు కోసం బుధవారం అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. ఫైనాన్షియల్ మార్కెట్‌లో నిబంధనలు బలోపేతం చేయడం కోసం మరియు వేగవంతమైన అంతర్జాతీయ ఆర్థిక రికవరీకి చేపట్టవలసిన చర్యలు వంటి అంశాలను ఈ జీ- 20 సదస్సులో ప్రధాని చర్చించనున్నారు.

మన్మోహన్‌తో పాటు ప్రణాళిక కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లూవాలియా, జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌లు కూడా ఈ సదస్సుకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 24 నుంచి 25వ తేదీ వరకు ఈ జీ- 20 సదస్సు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా నేతృత్వంలో పిట్స్‌బర్గ్‌లో నిర్వహించనున్నారు.

ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలే కాకుండా.. జీ- 8 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన అధికారులు కూడా ఈ సదస్సుకు రానున్నారు. కాగా, అంతర్జాతీయ జాతీయ స్థూల ఉత్పత్తి (గ్లోబల్ జీడీపీ)లో 90 శాతం వరకు భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్‌లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైన తర్వాత ఈ సదస్సును మూడోసారి నిర్వహిస్తున్నారు. గత సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలు అయ్యాయి..? ఎంత వరకు సత్ఫలితాలనిచ్చాయి..? అనే విషయాలపై తాజాగా జరుగనున్న సదస్సులో సమీక్షించనున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.