సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఎమ్‌టీఎన్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం కుదురుతుంది: ప్రధాని (Telecom Sector | MTN | Airtel | India | South Africa | PM | Manmohan singh)
 
టెలికాం రంగంలో అగ్రగామిగానున్న ఎమ్‌టీఎన్‌తో దేశీయ ప్రైవేట్ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందం గురించి జరుపుతున్న చర్చలు సఫలీకృతం కాగలవని భారత ప్రధాని మన్నోహన్ సింగ్ అన్నారు.

జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పిట్స్‌బర్గ్ వచ్చిన ఆయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జైకబ్ జుమాను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశీయ టెలికాం ప్రైవేట్ కంపెనీ అయిన ఎయిర్‌టెల్ సంస్థ గత కొద్ది రోజులుగా ఎమ్‌టీఎన్‌తో ఒప్పందం కోసం సంప్రదింపులు సజావుగానే జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇరు దేశాల ఉన్నతాధికారులు ఈ విషయంపై సంప్రదింపులు జరిపి, చర్చిస్తారని ఆయన అన్నారు. వీలైనంత మేరకు రెండు ప్రధాన కంపెనీల ఒప్పందం కుదురుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా భారతీ ఎయిర్‌టెల్ మరియు ఎమ్‌టీఎన్ సంస్థలు సంయుక్తంగా 23 వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడ్డాయి. దీంతో 20 కోట్ల మంది వినియోగదారులు కలిగిన సంస్థగా ఆవిర్భవించనుంది. కాగా ఈ రెండు సంస్థల ఒప్పందంతో ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద టెలికాం సంస్థగా రూపాంతరం చెందుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.