సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పైలెట్ల సమ్మెతో ఏఐ విమాన సర్వీసులు రద్దు (Pilots strike | Air India | flight services cancelled | 400 members | mass leaves | PLI)
 
మొత్తానికి ఎయిర్ ఇండియాలో మరో సంక్షోభం ఆజ్యం పోసుకుంది. తమ వేతనాల్లో తగ్గింపులు చేపట్టేందుకు ఎయిర్ ఇండియా సిద్ధపడటంతో.. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ... ఆ సంస్థ పైలెట్లు మూకుమ్మడి సెలవులను తీసుకున్నారు. ఇప్పటి వరకు యూనియన్ ఏర్పాటు చేయకపోయినప్పటికీ.. సీనియర్ పైలెట్లు మాత్రం సుమారు 400 మంది ఈ మూకుమ్మడి సెలవులను తీసుకున్నట్లు సమాచారం.

అంతకుముందు.. ఆర్థిక సంక్షోభం, పెరుగిన ఇంధన ధరలు వంటి అంశాలు ఎయిర్ ఇండియాను బాగా కష్టాల్లోకి నెట్టింది. దీంతో ఎయిర్ ఇండియా నష్టాలను తగ్గించుకునేందుకు కోసం.. వివిధ రకాల చర్యలను చేపట్టింది. అందులో భాగంగా ఎగ్జిక్యూటివ్, అధికారుల వేతనాల్లో ఉత్పత్తి అనుబంధిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ)లను 50 శాతం మేరకు కుదించాలని నిర్ణయించింది.

దీనికి సంబంధించి సంస్థలోని ఎగ్జిక్యూటివ్, అధికారుల వేతనాలను సమీక్షించాల్సిందిగా ఎయిర్ ఇండియా ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. వేతనాల కుదింపు నిర్ణయం సమంజసం కాదని.. దీన్ని అమలు చేస్తే.. సమ్మె తప్పదని నిన్న రాత్రే ఎయిర్ ఇండియా పరిపాలన విభాగాన్ని ఎగ్జిక్యూటివ్ పైలెట్లలోని ఓ విభాగం హెచ్చరించినట్లు తెలిసింది.

ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. సంస్థలోని సుమారు 400 మంది సీనియర్ పైలెట్లు మూకుమ్మడి సెలవులను తీసుకున్నారు. దీంతో ఇప్పటికే.. ఎయిర్ ఇండియా కొన్ని విమానయాన సర్వీసులను రద్దు చేసింది. ఇటీవలే పైలెట్ల సమ్మెతో కొన్ని కోట్లు నష్టపోయిన ఎయిర్ ఇండియా మళ్లీ ఈ సారి సమ్మెతో ఎంతో నష్టపోనుందో అంచనాకు రావడం కష్టమని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు.

సమ్మె చేస్తున్న పైలెట్లలో చాలా వరకు పరిపాలన విభాగంలోను భాగమయి ఉన్నారని.. వివరించారు. ఇక సమ్మె చేస్తున్న పైలెట్లు మరియు పరిపాలన విభాగానికి మధ్య నేడు కీలక చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.