ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత: జీ- 20 (G 20 | developing countries | importance | crisis control | economic crisis | reforms)
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణ, మార్గనిర్దేశ చర్యల్లో చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని పీట్స్‌బర్గ్‌లో జరిగిన జి- 20 దేశాల నేతలు తీర్మానించారు. అంతేకాకుండా జి- 20 దేశాల సంక్షోభ నివారణ చర్యలు విజయవంతమయ్యాయని శుక్రవారం ప్రకటించారు.
ఆర్థిక మాంద్యం నుంచి పూర్తిగా బయటపడే వరకు అత్యవసర ఆర్థిక మద్దతును కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక వృద్ధిలో తిరిగి సమతూకం సాధించేందుకు ఉమ్మడి చర్యల కార్యాచరణ ప్రణాళికకు బీజం వేశారు. బ్యాంకులకు 2012నాటికి కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.
భూమి మీద మూడింట రెండొంతుల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న జి- 20 దేశాల నేతలు ఉద్యోగాలు, వృద్ధి, ఆర్థిక పురోగమనానికి అంతర్జాతీయ ప్రణాళికను పాటించేందుకు అంగీకరించారని రెండు రోజులపాటు నేతల మధ్య జరిగిన చర్చల అనంతరం బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్ ప్రకటించారు.