సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » కామన్వెల్త్ మైక్రో ఫైనాన్స్ కార్డును ప్రారంభించనున్న కలాం (Commonwealth Micro Finance | Prepaid Card | Banking Services | Kalam)
 
Srini
WD
బ్యాంకింగేతర సంస్థల్లో బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం కామన్వెల్త్ మైక్రో ఫైనాన్స్ సంస్థ ప్రీపెయిడ్ కార్డును ప్రవేశపెట్టింది. దీన్ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ కార్డును చెన్నయ్‌లో గురువారం ఆవిష్కరించనున్నారు. రెప్కో బ్యాంకు కో బ్రాండెడ్ అయిన కామన్వెల్త్ బ్యాంకును వివిధ వివధ కార్యకలాపాల కోసం ఉపయోగించేలా రూపొందించారు.

బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న కామన్వెల్త్ బిజినెస్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ కావన్వెల్త్ కార్డును ప్రవేశపెట్టాయి. బహుళ ప్రయోజనాలు చేకూర్చే ఈ కార్డు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి దేశంలో అందుబాటులోకి రానుంది. దేశంలోని బ్యాకింగేతర కార్యకలాపాలు సాగిస్తున్న ప్రజల ఉపయోగార్థం ఈ కార్డును ప్రవేశపెట్టారు.

మద్రాసు విశ్వవిద్యాలయంలో సెనెటరీ హాలులో జరిగే ఒక కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాల్గొని ఈ కార్డును ఆవిష్కరిస్తారు. గురువారం నుంచి ఈ కార్డు తమిళనాడులోని అన్ని రెప్‌కో బ్యాంకు బ్రాంచ్‌లలతో పాటు.. ఉత్తర మద్రాసులోని తండయార్ పేట, వాషర్‌మెన్ పేట్, రాయపురం, తిరువొట్టియూర్ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి రానుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.