సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » సంక్షోభం ముగిసింది: ద్రవ్యోల్బణంపై ప్రధాని (Economic stimulus | Inflation | PM | Manmohan | Mumbai | poll | environmental concerns | inter linking rivers)
Feedback Print Bookmark and Share
 
అంచనాలకు తగ్గట్టుగా మెరుగపై రబీ పంట మరియు అదనపు అంశాలతో ఆర్థిక సంక్షోభం ముగిసిపోయిందని ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. కానీ ధరలు నియంత్రణలోకి తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అయితే రబీ పంట బాగా ఉండటంతో... ఇది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపగలదన్నారు.

మహారాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ముంబైలో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ముంబై విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నదుల అనుసంధానంపై వచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం పర్యావరణ భయాందోళనలపై సమగ్రంగా సమీక్షించాల్సి ఉందన్నారు.

కాగా, కంపెనీ సీఈఓల వేతనాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఆ వేతనాలపై ఎలాంటి పరిమితులను విధించలేదని వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.