అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో డాలర్ పతనం కొనసాగడంతో గడచిన వారంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఇది బంగారం ప్రతి ఔన్స్ ధర 1060.00 డాలర్లకు చేరుకుంది. అదే దేశంలో దీపావళి పండుగ రావడంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఢిల్లీలోని బులియన్ మార్కెట్లో గత వారం చివరినాటికి ఏకంగా రూ. 240లు పెరిగాయి. అదే వెండి ధరలు ప్రతి కిలోకు రూ. 1270లకు చేరుకున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
వివిధ కరెన్సీలతోపాటు కేవలం ఒక్క డాలరు ధర పడిపోవడంతో డబ్బులను పెట్టుబడిగా పెట్టేవారు తమ సొమ్మును బంగారంపైనే పెట్టుబడి పేడుతున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దీంతో సోమవారంనాడు ప్రతి ఔన్సు 1004.80 డాలర్లకు చేరుకుంది. ఇది గత వారాంతానికి 43.60 డాలర్లు పెరిగి 1048.40 డాలర్ల వద్దకు చేరుకుంది.