సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » చమురు ఉత్పత్తులను పెంచనున్న కొలంబియా (Crude Oil | Production | Columbia | Barrels | Plan)
Feedback Print Bookmark and Share
 
FILE
వచ్చే 2015వ సంవత్సరం నాటికి ముడి చమురు ఉత్పత్తుల సామర్థ్యం పెంచి ప్రతి రోజు పది లక్షల బ్యారెళ్ళకు చేరుకునేందుకు కొలంబియా ప్రణాళికలు సిద్ధం చేసింది.

కొలంబియాలో వచ్చే 2015 నాటికి ముడి చమురు ఉత్పత్తుల సామర్థ్యం పెంచి ప్రతి రోజు పది లక్షల బ్యారెళ్ళను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకున్నట్లు కొలంబియా పెట్రోలియం శాఖ ఉన్నతాధికారి ఆర్మాండో జమోరా తెలిపారు.

తమ దేశంలో ప్రస్తుతం ప్రతి రోజు ఆరు లక్షల ఎనభై వేల బ్యారెళ్ళ ముడి చమురును ఉత్పత్తి చేస్తోందని, వచ్చే రెండు సంవత్సరాలలో వీటి సంఖ్య ఎనిమిది లక్షల బ్యారెళ్ళకు పెంచుకుంటామని ఆయన వెల్లడించారు.

ఇదిలావుండగా దేశంలో ముడి చమురు ఉత్పత్తుల సామర్థ్యం ప్రతి ఏడాదికి 80 వేల బ్యారెళ్ళు పెరుగుతున్నాయని, దీంతో పాటు 2015 నాటికి ప్రతి రోజు పది లక్షల బ్యారెళ్ళను ఉత్పత్తి చేసేందుకు తాము ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.