దేశంలోని బ్యాంకులకు సాఫ్ట్‌వేర్ సేవలను అందించే లేజర్ సాఫ్ట్‌వేర్ సంస్థను పొలారిస్ సాఫ్ట్‌వేర్ ల్యాబ్ సొంతం చేసుకోనుంది. దీనికోసం పొలారిస్ సాఫ్ట్‌వేర్ ల్యాబ్ సంస్థ రూ.52 కోట్ల నిధులను చెల్లించనుంది.
లేజర్ సాఫ్ట్‌వేర్ సంస్థను నిబంధనల మేరకే కొనుగోలు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. తాము ఆ సంస్థకు చెల్లించే మొత్తం రుసుంలో రూ.35 కోట్లను నగుదుగా చెల్లించి మిగిలిన సొమ్మును రానున్న రెండేళ్లలో పనితీరు ఆధారంగా చెల్లిస్తామని పొలారిస్ వెల్లడించింది.
లేజర్ సాఫ్ట్‌వేర్ సంస్థ కొనుగోలుకు అవసరమైన నిధులను సంస్థ అంతర్గత సమీకరణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు పొలారిస్ ప్రకటించింది. ఈ కొనుగోలు ప్రక్రియకు నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది.