ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పెట్రోలు ధరలు పెంచేయోచన లేదు: మంత్రి (International Market | Crude Oil | Petrol | Diesel | Govt | Rates | Murali Deora)
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో వచ్చిన మార్పులుకు అనుగుణంగా పెట్రోలు, డీజల్ ధరలను పెంచేయోచన ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముడి చమురు ధరలు అంతర్జాతీయ స్థాయిలో మార్పులు చెందడంతో దేశంలో పెట్రోలు, డీజల్ ధరలను పెంచేయోచనేదీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళీ దేవరా అన్నారు.
డాలర్ కారణంగా రూపాయి విలువ పెరిగినా అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరిగినా కూడా దేశంలో ముడి చమురు ధరలను పెంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు ప్రతి బ్యారెల్ 78 డాలర్లకు చేరుకుంది. ఈ పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని ఆయన అన్నారు.
దేశంలో ముడి చమురు ధరలు పెరిగవని ఆయన చెప్పారు. డాలర్ కారణంగా రూపాయి పరిస్థితి మరింత బలపడనుండటంతో పెట్రోలు ధరలు పెరగవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో డాలరు విలువ 10 శాతం తక్కువగానే ఉందని ఆయన తెలిపారు.
అక్టోబర్ ప్రథమార్థంలో రూపాయి విలువ మరింత పుంజుకుందని, ఈ నేపథ్యంలో ఇంధన విక్రయంలో ప్రతి రోజు సంభవించే రూ. 124 కోట్ల నష్టాలనుంచి రూ. 96 కోట్లకు తగ్గిందని ఆయన వివరించారు.